రోడ్డు ప్రమాదం.. యువకుడికి గాయాలు..

రోడ్డు ప్రమాదం.. యువకుడికి గాయాలు..

చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని భువనగిరి రోడ్డులో ఉన్న భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామానికి చెందిన నితిన్ అనే యువకుడు రామన్నపేట నుండి చిట్యాల వైపు తన వాహనంపై వస్తున్నాడని.. ఈ క్రమంలో భువనగిరి రోడ్డులో ఎదురుగా వస్తున్న మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన ఒక డీసీఎం వాహనం నితిన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ​

ఈ ప్రమాదంలో యువకుడు నితిన్ గాయపడ్డాడు. ​ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ​ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నితిన్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ​ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply