శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ ప్రతిష్టా

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ ప్రతిష్టా
మహోత్సవాలకు..తరలిరండి
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : మండలంలోని లత్తవరం గ్రామంలోని కొండ మీద ఉన్న, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం లో ఈనెల 31వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు ( మూడు రోజులపాటు ) జరిగే విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలకు, పెద్ద ఎత్తున తరలిరావాలని గ్రామ మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బోధపాటి గోవిందప్ప, కొర్రపాటి మల్లికార్జునలు పిలుపు నిచ్చారు.
గురువారం గ్రామంలో ఇంటింటికి తిరిగి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రతిష్టా మహోత్సవాలకు ఆహ్వాన పత్రికలను అందజేసి, పెద్ద ఎత్తు తరలి రావాలన్నారు. నరసింహ స్వామి వారి చిత్రపటం, అన్నమయ్య లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
