ప్రమాదవశాత్తు కూలీ మృతి

ప్రమాదవశాత్తు కూలీ మృతి
చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండల పరిధిలోని వెలిమినేడు గ్రామ శివారులో నిర్మాణ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడి ఓ కూలీ మృతి చెందినట్లు స్థానికులు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంపశ్చిమ బెంగాల్ రాష్ట్రం, దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా, రామచంద్రపూర్ గ్రామానికి చెందిన నారాయణ చంద్ర రాయ్ (43) గత రెండు నెలలుగా వెలిమినేడు శివారులోని శ్రీ లక్ష్మి కన్స్ట్రక్షన్ కంపెనీలో గోడ నిర్మాణ పనులు చేస్తున్నాడు అని.ఈ నెల 13వ తేదీన తోటి కూలీలతో కలిసి సుమారు 12 అడుగుల ఎత్తు లో తడకలపై నిలబడి పని చేస్తుండగా, ఒక్కసారిగా ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు.
ఈ క్రమంలో కింద ఉన్న ఐరన్ రాడ్ అతని తలకు బలంగా గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావమైంది అని తెలిపారు తీవ్రంగా గాయపడిన నారాయణ చంద్ర రాయ్‌ను వెంటనే నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన, పరిస్థితి విషమించడంతో మార్చి 17చికిత్స పొందుతూ మృతి చెందాడు అని తెలిపారు. ఈ ఘటనపైమృతుని బావ నితిన్ సర్కార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేపట్టినట్లు ఎస్సై మామిడి రవి తెలిపారు.
