ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ..

ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ..

అందజేసిన కార్పోరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్.

కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ లోని 35వ డివిజన్ శివనగర్ లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ అందజేశారు. బుధవారం లబ్ధిదారులకు ఇందిరమ్మ పత్రాలు అందజేసిన అనంతరం కార్పోరేటర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని అన్నారు. పిసిసి కార్యదర్శి కొత్తపళ్లి శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు రేణిగుంట్ల శివకుమార్, కాంగ్రెస్ నాయకులు శ్రీరామ రాజేష్, పగడాల సతీష్, కొత్తూరు రాజు, లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో లబ్ధిదారులు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.