అమరజీవి త్యాగఫలమే ఆంధ్రప్రదేశ్..

అమరజీవి త్యాగఫలమే ఆంధ్రప్రదేశ్..

  • అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైజ్’ పేరుతో పొట్టి శ్రీరాములు స్మృతివనం
  • మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్
  • ఇబ్రహీంపట్నంలో అమరజీవికి నివాళులు

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పోరాడిన మననీయుడు, అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే వసంత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ పొట్టి శ్రీరాములు అంటూ నినదించారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ అమరజీవి త్యాగస్ఫూర్తిని భావితరాలకు చాటి చెప్పే విధంగా ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైజ్’ పేరుతో అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా ఆయన స్మృతివనంలో 58 అడుగుల ఎత్తైన భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కీ.శే. పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని ఆయన కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఆవిష్కరించనున్నారని చెప్పారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు పోరాటం చేశారని గుర్తు చేశారు. తన పోరాటంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారన్నారు. 1952లో మద్రాస్ లోని బలుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించారని, 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారన్నారు. దివంగత పొట్టి శ్రీరాములు నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడి ప్రాణత్యాగం చేశారని వివరించారు. ఆయన మృతితో ఎంతోమంది విద్యార్థులు, అభ్యుదయవాదులు, బయటకు వచ్చి పోరాడారని, దీంతో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని అప్పటి ప్రధాని ప్రకటించారన్నారు.

ఆంధ్రప్రదేశ్ సాధన కోసమే కాకుండా సాంఘిక అసమానతలు, దురాచారాలపై కూడా పొట్టి శ్రీరాములు గారు పోరాడారన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వృథా కానివ్వకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. తరలిన కూటమి కుటుంబ సభ్యులు, ఈ కార్యక్రమం అనంతరం అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కలసి కూటమి కుటుంబ సభ్యులు తరలివెళ్లారు. బీజేపీ సీనియర్ నాయకుడు నూతులపాటి బాల కోటేశ్వరరావు (బాల), జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply