పది పరీక్షలు మొదలు..
పది పరీక్షలు మొదలు..
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు- మార్చి 2026 ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఏపి ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి. కర్నూలు జిల్లాలో మొత్తం 37,331 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అందులో రెగ్యులర్ విద్యార్థులు 33,796 మంది కాగా, వన్స్ ఫెయిల్డ్ ప్రైవేట్ అభ్యర్థులు 1,975 మంది, ఏపీఓ ఎస్ ఎస్ విద్యార్థులు 1,560 మంది ఉన్నారు. ఇందులో బాలురు 19,893 మంది, బాలికలు 17,438 మంది పరీక్షలకు నమోదు అయ్యారు.
జిల్లాలో 552 పాఠశాలల నుంచి విద్యార్థులు: జిల్లాలోని 552 పాఠశాలల నుంచి విద్యార్థులు
పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో 361 ప్రభుత్వ పాఠశాలలు, 191 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి.
విభాగాల వారీగా చూస్తే..
ఆదోని డివిజన్ నుంచి 11,733 మంది, పత్తికొండ డివిజన్ నుంచి 6,609 మంది, కర్నూలు డివిజన్ నుంచి 15, 454 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వనున్నారు.
పరీక్షల నిర్వహణకు 160కేంద్రాలుః జిల్లాలో పరీక్షల నిర్వహణకు 47 జోన్లు, 160 పరీక్షా కేంద్రాలు
ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాల భద్రపరచడానికి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇక పరీక్షల నిర్వహణకు 160 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 160 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు 7. ఇక ప్రశ్నాపత్రాల పంపిణీకి రూట్ అధికారులు 12, సహాయ రూట్ అధికారులు 12 నియమించారు. చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. ఇక పరీక్షా కేంద్రాలకు ఎస్కార్ట్ సౌకర్యం, వాహనాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మకకేంద్రాల్లో నిరంతరం సిసిటివికెమెరాల నిఘా ఉంటు ంది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఇక పరీక్షకేంద్రంలోని సమీపంలోని జిరాక్స్ షాపులు మరియు ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయనున్నారు.
పరీక్షల సమయంలో అంతరాయం లేని విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. వేసవి కాలం దృష్ట్యా అన్ని కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, త్రాగునీటి సౌకర్యం, ముఖ్యమైన మందులు మెడికల్ స్టాఫ్ పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉంటారన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం అన్ని 160 కేంద్రాలలో తగినంత ఫర్నిచర్, తాగునీటి సదుపాయం కల్పించారు. ఇక విద్యార్థులు, సిబ్బంది కోసం ఏపీఎస్ఆర్టిసి ద్వారా ప్రత్యేక బస్సులు, ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ప్రశ్న పత్రాలను 34 పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. వీటిని పరీక్ష రోజు ఉదయం 8 గంటలకు తెరిచి, 8:30 కి కేంద్రాలకు చేరుస్తారు. మొబైల్ అనుమతి లేదుః పరీక్షకేంద్రాలోకి మొబైల్ ఫోన్స్ ఎటువంటి పరిస్థితిల్లో అనుమతించరు. ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవీ అనుమతించరు. ఇన్విజిలేటర్లకు కూడా పరీక్షకేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్లు తీసుకరాకూడదు.
స్పాట్ వాల్యూయేషన్ :
పరీక్షల అనంతరం ఏప్రిల్ 4 నుంచి 13 వరకు స్పాట్ వాల్యూయేషన్ నిర్వహించనున్నారు. కర్నూలు ఏ క్యాంప్ లోని మాంటెసారి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద మూల్యాంకనం జరుగుతుంది.
విద్యార్థులకు సూచనలు : పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్లో పేర్కొన్న సబ్జెక్టులకే పరీక్షలు రాయాలి. తప్పుగా ఇతర ప్రశ్నాపత్రాల్లో పరీక్ష రాస్తే ఆ పరీక్షలు రద్దు అవుతాయని అధికారులు హెచ్చరించారు. అలాగే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రంలోనే హాజరుకావాలి,
