మాన్యవర్ కాన్షీరాంకు వెంటనే భారతరత్న అవార్డు ప్రకటించాలి….

మాన్యవర్ కాన్షీరాంకు వెంటనే భారతరత్న అవార్డు ప్రకటించాలి….
బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జగన్ మోహన్
కడెం ( నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : బహుజన్ సమాజ్ పార్టీ ఖానాపూర్ నియోజక వర్గం ఇంచార్జ్ జోసఫ్ గంగారం ఆధ్వర్యంలో మాన్య కాన్షీరాం 92 వ జయంతి కడం మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ జగన్ మోహన్ హాజరై కాన్షీరాం చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ జగన్ మోహన్ మాట్లాడుతూb మాన్యవర్ కాన్సిరాం భారత రత్న అవార్డు వెంటనే ప్రకటించాలని అయన డిమాండ్ చేశారు.
దేశంలో బహుజనులకు రాజ్యాధికారం రుచి చూపించిన మహనీయుడు మాన్య కాన్షీరాంవారి ఆశయాలను సాధనలో ప్రతి ఒక్క బీఎస్పీ నాయకుడు పని చేయాలని. ఈ భారత దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత మైనారిటీలను రాజ్యాధికారం దిశగా అడుగులు వేయించి, రాజ్యాధికారం రుచి చూపించిన గొప్ప మహనీయులు మాన్యవార్ కాన్షీరాం అని.. ఎవ్వరి జనాభా ఎంతో వారికి అంత వాటా కావాలి అని చెప్పిన వ్యక్తి అణగారిన వర్గాల్లో ‘మేము కూడా పాలకులం కాగలం’ అనే ఆత్మవిశ్వాసాన్ని నింపిన మహనీయులు అని…”ఓటు మనది – రాజ్యాధికారం మనది” అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారన్నారు.
కాన్షీరామ్ తన జీవితాంతం పెళ్లి చేసుకోకుండా, సొంత ఆస్తిని కూడబెట్టుకోకుండా, తన కుటుంబంతో సంబంధాలను వదులుకుని కేవలం సమాజం కోసమే బతికారు. 85% ఉన్న బహుజనుల ఓట్లతో అధికారంలో వెళ్లిన అగ్రవర్ణాలు బహుజనులను బానిసలుగా చేసే కుట్రలు జరుగుతున్నాయని బెహన్ కుమారి మాయావతి నాయకత్వంలో బీఎస్పీ నాయకులు కార్యకర్తలు బహుజనులకు రాజ్యాధికారం దిశగా పని చేస్తాం అని అయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళ ఇంచార్జ్ లక్ష్మీ యాదవ్,నియోజకవర్గం ఇంచార్జ్ జోసఫ్ గంగారం, ప్రదాన కార్యదర్శి తుడిచర్ల సంజయ్, జరి త్రిషరన్, కడెం సీనియర్ నాయకులు లక్ష్మణ్ కుమార్, నరసయ్య జాలిగామ, గుడికందుల నరసయ్య దుబ్బాక రాజ్ కుమార్, కూచన్ పల్లి ఆకాష్,జాడి పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
