ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

  • పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పేదలకు ముఖ్యమంత్రి సహాయనిది(సీఎంఆర్ఎఫ్) ఆర్థిక ఊరట కలిగిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం నియోజకవర్గానికి సంబంధించిన వివిధ గ్రామాలకు చెందిన 238 మంది సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు రూ. 75 కోట్ల 88 లక్షల విలువ గల చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే శనివారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో పెద్దపల్లి నియోజకవర్గానికి దాదాపు రూ. 1000 కోట్లు పైచిలుకు అభివృద్ధి పనులు మంజూరు చేయడం మన అదృష్టమని, ప్రజల దీవెనలతో గెలిచిన తాను ప్రతిక్షణం ప్రజల సంక్షేమం కోసమే నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి లేకుండా పాలన సాగిస్తున్నామని అన్నారు. జి

ల్లా కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నూతన భవన నిర్మాణం శరవేగంగా సాగుతోందని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రంలోనే సేవల విషయంలో మొదటి స్థానంలో ఉందన్నారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లు నూగ్గిళ్ల మల్లయ్య, బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ చైర్మన్ లు కూర మల్లారెడ్డి, ప్రకాశ్ రావు, సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply