కనకదుర్గమ్మకు బంగారు సూత్రాలు…

కనకదుర్గమ్మకు బంగారు సూత్రాలు…

రూ.5.32 లక్షల విలువైన కానుక సమర్పించిన భక్తుడు.

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మ మల్లేశ్వర స్వామి వారికి అమ్మవారి అలంకరణ కోసం ఏలూరు జిల్లా మండవల్లి మండలం చింతలపూడికి చెందిన మేడపాటి వెంకట నాగిరెడ్డి కుటుంబ సభ్యులు బంగారు సూత్రాలను విరాళంగా సమర్పించారు.

దాతలు శనివారం ఆలయ ఈవో శీనా నాయక్ చైర్మన్ బొర్రా గాంధీ లను కలిసి 32.500 గ్రాముల బంగారు సూత్రాలను సమర్పించారు. ఈ బంగారు కానుక విలువ సుమారు రూ.5,32,500గా ఉండగా, అమ్మవారి అలంకరణ కు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేసి వేద ఆశీర్వచనం అనంతరం శేషవస్త్రం, ప్రసాదాలను అందించారు.

Leave a Reply