Sangareddy | జంట హత్యల కలకలం..

Sangareddy | జంట హత్యల కలకలం..

అత్యంత కిరాతకంగా…


Sangareddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వాచ్‌మెన్ దంప‌తుల‌ను దారుణంగా హ‌త్య చేసిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి (Sangareddy) జిల్లా పటాన్‌చెరులో చోటుచేసుకుంది. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న దంపతులను గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్యచేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

పోలీసులు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం… రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District) దొంగచింత తండాకు చెందిన సోమ్లా దశరథ్ (50), మాన్యమ్మ (45) దంపతులు బ్రతుకుదెరువు కోసం కొంతకాలం క్రితం నగరానికి వచ్చారు. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని సిటిజెన్ కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో వాచ్‌మెన్లుగా చేరి, అక్కడే నివాసముంటున్నారు.

అయితే ఇవాళ ఉదయం పనుల కోసం వచ్చిన నిర్మాణ సిబ్బంది, దంపతులు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ జంట హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply