పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణ కేంద్రంలో శనివారం నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉట్నూరు మండల విద్యాశాఖ అధికారి ఆశన్న తెలిపారు. పరీక్షల నిర్వహణకు నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని ఈ పరీక్షల్లో 804 మంది విద్యార్థులు పరీక్షలు రాయలు ఉన్నారని ఆయన తెలిపారు.
ఉట్నూర్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక కేంద్రం బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో, పులాజి బాబా పాఠశాలలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామని, పరీక్ష కేంద్రాల్లో నలుగురు పరీక్ష చీఫ్ సూపర్డెంట్లు, నలుగురు డిపార్ట్మెంట్ అధికారులు, 44 మంది ఇంజిలేటర్లు ఏర్పాటు చేశామని అన్ని కేంద్రాల్లో సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ ఆశన్న తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్ట చర్యలు చేపట్టామని పరీక్షలు రాసే విద్యార్థులకు మంచినీటి వసతి పలు రకాల వసతులు కల్పించామని ఆయన తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులు భయపడకుండా నిర్భయంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన కోరారు.
