Jana nayagan | ఇప్పట్లో రిలీజ్ లేనట్టేనా..?

Jana nayagan | ఇప్పట్లో రిలీజ్ లేనట్టేనా..?
Jana nayagan | విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ రిలీజ్ ఆలస్యం
సెన్సార్ సమస్యలతో ఆగిపోయిన మూవీ
రాజకీయాల్లో బిజీగా విజయ్.. సినిమాను పట్టించుకోవడం లేదా?
ఓటీటీ డీల్ నుంచి అమెజాన్ తప్పుకుందా?
నెట్ ఫ్లిక్స్ చేతుల్లో జన నాయగన్ భవితం
120 కోట్లు నష్టం అంటూ వస్తున్న వార్తలు
Jana nayagan | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన ఆఖరి సినిమా జన నాయగన్. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. రిలీజ్ కి అంతా రెడీ అయ్యింది అనుకున్న టైమ్ లో సెన్సార్ కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టాలు తీరలేదు.. సినిమా రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఈ భారీ, క్రేజీ మూవీకి భారీ నష్టం అని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. భారీ నష్టం ఏంటి..? ఈ భారీ సినిమా థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు..?
Jana nayagan | విజయ్ పట్టించుకోవడం లేదా..

జనవరిలో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన జన నాయగన్ మూవీ.. ఫిబ్రవరిలో అయినా రిలీజ్ అవుతుందని ఎదురు చూశారు అభిమానులు. ఈమధ్య అంతా సెట్ అయ్యింది. సెన్సార్ కష్టాలు తీరాయి ఇక రిలీజ్ చేయడమే ఆలస్యం అన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఎంత ప్రయత్నించినా అడ్డంకులు తొలగడం లేదు. జన నాయగన్ థియేటర్స్ లోకి రావడం లేదు. మరో వైపు విజయ్.. రాజకీయాల్లో బిజీ అయ్యాడు. దీంతో జన నాయగన్ మూవీ గురించి పట్టించుకోవడమే మానేసాడని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది.
Jana nayagan | అమెజాన్ తప్పుకుందా..

ఇలా జనవరిలో రిలీజ్ కావాల్సిన జన నాయగన్ రెండు నెలలు అవుతున్నా ఇంకా రిలీజ్ కాకపోవడంతో రోజురోజుకు ఈ సినిమా పై క్రేజ్ తగ్గుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేకపోవడంతో.. ఈ సినిమాని తీసుకున్న అమెజాన్ సంస్థ తప్పుకుందని తెలిసింది. దీంతో జన నాయగన్ నిర్మాతలు.. నెట్ ఫ్లిక్స్ ను కాంటాక్ట్ చేశారని సమాచారం. భారీ సినిమాలను కొనాలంటే.. అమెజాన్, నెట్ ఫ్లిక్స్. ఈ రెండే కొనాలి. అయితే.. ఈ రెండింటిలో అమెజాన్ తప్పుకోవడంతో ఇక నెట్ ఫ్లిక్స్ తీసుకోవాలంటే.. అది ఎంత చెబితే అంతకు నిర్మాత ఇవ్వాలి.
Jana nayagan | 120 కోట్లు భారీ నష్టం..

ఈ సినిమా విషయంలో నెట్ ప్లిక్స్ ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్టుగా తయారైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అమెజాన్ సంస్థ ఈ సినిమాని 120 కోట్లకు కొన్నది. ఇప్పుడు అమెజాన్ తప్పుకోవడంతో జన నాయగన్ నిర్మాతకు 120 కోట్లు నష్టమని వార్తలు వస్తున్నాయి. రోజురోజుకు ఈ సినిమా పై క్రేజ్ తగ్గడంతో ఓటీటీ రైట్స్ కు రేటు మరింత తగ్గడం ఖాయం. మరి.. నెట్ ఫ్లిక్స్ ఎంతకి తీసుకుంటుందో.. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
