వంట గ్యాస్ కోసం తప్పని తిప్పలు..

బోధన్, ఆంధ్రప్రభ : వంట గ్యాస్ కొరత ఏర్పడుతుందంటూ వదంతులు వెలు వడుతుండడంతో బోధన్ లో గ్యాస్ వినియోగదారులు ఏజెన్సీల ముందు బారులు తీరారు. వినియోగదారులకు ఇంటికి గ్యాస్ సిలిండర్ లు సరఫరా చేసే అవకాశం ఉన్నప్పటికీ వారు ఏజెన్సీల వద్దకు వచ్చే వాటిని తీసుకువెళ్లడానికి పోటీ పడుతున్నారు.

వినియోగదారులు ఎక్కువమంది ఒకే సారి రావడంతో ఏజెన్సీ నిర్వాహకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డోర్ డెలివరీ చేస్తామని చెబుతున్నప్పటికీ వినియోగదారులకు నమ్మకం కుదరడం లేదు.

గ్యాస్ కొరత లేదని ఓటీపీలు వచ్చిన ప్రతివారికి గ్యాస్ అందిస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. బోధన్ పట్టణంలోని ఓ గ్యాస్ ఏజెన్సీ ప్రతిరోజు 500 సిలిండర్లను వినియోగదారులకు అందజేస్తుంది.వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సరఫరాను గ్యాస్ ఏజెన్సీలు నిలిపివేశాయి.

Leave a Reply