మల్యాల గిరిజనులకు అండగా ఉంటా..

మల్యాల గిరిజనులకు అండగా ఉంటా..

అసెంబ్లీలో సమస్యను ప్రస్తావిస్తా..
ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్

జన్నారం,ఆంధ్రప్రభ : మల్యాల గిరిజనుల న్యాయం కోసం అండగా ఉంటానని,సమస్య పరిష్కారం కోసం అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన మల్యాలలో గురువారం రాత్రి గిరిజనులతో ఏర్పాటు ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ,అనాదిగా మల్యాలలో నివసిస్తున్న గిరిజనుల సమస్యలు తనకు తెలుసన్నారు.

కవ్వాల టైగర్ జోన్ నిబంధనల మేరకు అడవుల్లోని ఆ గ్రామ గిరిజనులను వేరే ప్రాంతానికి తరలించడానికి సిద్ధం చేస్తున్నారని,ఆ గిరిజనులకు అనువైన భూ స్థలాన్ని చూపిస్తేనే వెళ్తారని,ఈ వ్యవహారంలో తాను గిరిజనుల పక్షాన ఉంటానని ఆయన చెప్పారు.ఆ గ్రామ గిరిజనులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని,అటవీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.

గ్రామంలో ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో గ్రామ సర్పంచి కుర్ర భాగ్యలక్ష్మి- పోచన్న, తదితరులుపాల్గొన్నారు

Leave a Reply