శ్రీ సల్లాపురమ్మ జాతరకు రండి..

శ్రీ సల్లాపురమ్మ జాతరకు రండి..

రాప్తాడు, ఆంధ్రప్రభ : కోరిన కోరికలు తీర్చే మా గ్రామ దేవత శ్రీ సల్లాపురమ్మ జాతరను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నామని దగ్గుపాటి శ్రీనివాసులు పేర్కొన్నారు. రాప్తాడు మండల పరిధిలోని యం.బండమీదపల్లి గ్రామం నందు శ్రీ సల్లాపురమ్మ జాతర, సీతారామ చెక్కభజన గజ్జల పూజ ఉచిత నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. గురువారం గ్రామ పెద్దలు రాప్తాడు పోలీస్ స్టేషన్ నందు పోలీస్ శాఖ అనుమతి తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం గ్రామంలో శ్రీ సల్లాపురమ్మ జాతరను ఘనంగా వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈనెల 21, 22 తేదీలలో జాతర, సీతారామ చెక్కభజన, గజ్జల పూజ తోపాటు ఉచిత నాటక ప్రదర్శన, ఆణిముత్యాలు, రామాంజనేయ యుద్ధం, సుభద్ర రాయబారం, గయోపాఖ్యానం, సత్య హరిచంద్ర డ్రామా ఉంటుందన్నారు. గుడి దగ్గర భక్తాదులకు ఉచిత అన్నదానము మంచినీరు ఏర్పాటు చేస్తున్నాము. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తాదులు, జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున జాతరకు రావాలని కోరుతున్నాం.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉమాదేవి పక్కీరప్ప, ఎంపీటీసీ రుక్మిణమ్మ, వై.నరసింహా రెడ్డి, బి.వెంకట్రాముడు, సాయినాథ్ రెడ్డి, నరసింహారెడ్డి, తలారి చెండ్రాయుడు, చంద్రప్ప, కదిరప్ప, ఈశ్వరయ్య, రాము, సల్లప్ప, నాగరాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply