ఐతవరంలో స్పృహ కోల్పోయిన వ్యక్తి..

ఐతవరంలో స్పృహ కోల్పోయిన వ్యక్తి..
విజయవాడ ఆస్పత్రిలో మృతి
నందిగామ, ఆంధ్రప్రభ : నందిగామ మండలం ఐతవరం గ్రామంలో 60 సంవత్సరాలు గల ఒక వ్యక్తి మూడు నెలలుగా ఐతవరం గ్రామంలో భిక్షాటన చేస్తున్నట్లు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. వివరాల్లోకి వెళితే సదరు వ్యక్తి జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఐతవరం గ్రామం రోడ్డు పక్కన ఈనెల 9వ తేదీన తెల్లవారుజామున రోడ్డు పక్కన స్పృహ కోల్పోయి ఉండగా గ్రామస్తులు సమాచారం ఇవ్వగా అంబులెన్స్ లో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అత్యవసర చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపగా ఈనెల 10వ తేదీ ఉదయం 9 గంటల 45 నిమిషాలకు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీనిపై నందిగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. సీఐ వైవిఎల్ నాయుడు మాట్లాడుతూ సదరు వ్యక్తికి సంబంధించిన వివరాలు మగ వ్యక్తి 60 సంవత్సరాలు ఉంటాయని, ఎత్తు 5 అడుగుల మూడు అంగుళాలు ఉంటారని, వైట్ కలర్ గళ్ళ లుంగి ధరించారని, దయచేసి సదరు వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే నందిగాం పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు.

