Nagarjuna | నిర్ణయం సరైనదేనా..?
Nagarjuna | నిర్ణయం సరైనదేనా..?
Nagarjuna | రాజమౌళి సినిమాకు నాగార్జున ఎందుకు నో చెప్పారు..?
విలన్ పాత్రలో వీల్ ఛైర్ ట్విస్ట్ ఇదేనా..?
నాగార్జున 100వ సినిమా పై ఆసక్తికర అప్‌డేట్
సంక్రాంతికి రాబోతున్న సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్
Nagarjuna | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ కింగ్ నాగార్జున.. ఇప్పటి వరకు ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. ఇంకా చెప్పాలంటే.. ఆయన జనరేషన్ హీరోల్లో ఏ హీరో చేయనంతగా వైవిధ్యమైన పాత్రలు పోషించి.. మెప్పించారు. అందుకనే ఆయన్ని ట్రెండ్ సెట్టర్ (Trend Setter) అంటారు. ఇదిలా ఉంటే.. దర్శకధీరుడు రాజమౌళి వారణాసి మూవీలో నాగ్ నటిస్తున్నట్టుగా ఆమధ్య ప్రచారం జరిగింది. తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే.. రాజమౌళి.. నాగార్జునను కాంటాక్ట్ చేసారు కానీ.. నాగ్ నో చెప్పారని టాక్ వినిపిస్తోంది. అసలు ఏమైంది..? ఎందుకు నాగ్ జక్కన్నకు నో చెప్పారు..?

Nagarjuna | అందుకే నాగ్ నో చెప్పారా..?
రాజమౌళి.. వారణాసి సినిమాలో.. విలన్ పాత్ర కోసం నాగార్జునను సంప్రదించారట. అయితే.. ఇందులో విలన్ వీల్ ఛైర్ కే పరిమితం అయ్యే పాత్ర. నాగార్జున ఆల్రెడీ వీల్ ఛైర్ కే పరిమితం అయ్యే పాత్రను ఊపిరి సినిమాలో చేసేసారు. మళ్లీ అలాంటి క్యారెక్టర్ చేయడం నాగార్జునకు ఇష్టం లేదట. పైగా మహేష్ బాబు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపిస్తుంటే.. నాగార్జున ఒక్క వీల్ ఛైర్ కే పరిమితం అయి విలన్ గా(Vilan) నటించడం ఏమాత్రం బాగోదు అనే ఉద్దేశ్యంతో సున్నితంగా నో చెప్పారట. ఈ పాత్రనే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్నారు. అయితే.. రాజమౌళితో నాగార్జునకు మంచి అనుబంధం ఉంది. ఆ కారణంగా భవిష్యత్ లో రాజమౌళి సినిమాలో నటించే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.

Nagarjuna | నాగ్ 100 దసరాకి రిలీజ్..
ఇప్పుడు నాగార్జున ఫోకస్ అంతా 100వ సినిమా పైనే పెట్టారు. ఈ సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున (Nagarjuna) స్వయంగా నిర్మిస్తున్నారు. ఏమాత్రం హడావిడి లేకుండా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో సీనియర్ నటి టబు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. దసరాకి రిలీజ్ చేయాలి అనేది నాగ్ ప్లాన్ అని సమాచారం. ఇది ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటూనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుందని.. పీరియాడిక్ ఫిల్మ్ అని ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ.. మేకర్స్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో అఫీషియల్ గా అప్ డేట్ ఇవ్వనున్నారని సమాచారం.

Nagarjuna | సంక్రాంతికి వస్తున్న సోగ్గాడు..
నాగార్జున 100వ సినిమా కాకుండా 101వ సినిమా కూడా అనౌన్స్ చేశారు. అదే సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్. ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ (Release) చేయనున్నట్టుగా ప్రకటించారు. సంక్రాంతికి నాగార్జున సినిమా రిలీజ్ చేసిన ప్రతిసారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు. నా సామి రంగ తర్వాత నాగార్జున సంక్రాంతికి కొత్త సినిమా రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఈసారి సంక్రాంతి మిస్ చేయకూడదనే ఉద్దేశ్యంతో పక్కా ప్లాన్ రెడీ చేశారు. మరి.. సంక్రాంతికి సోగ్గాడు ఏ రేంజ్ లో సందడి చేస్తాడో చూడాలి.

