మున్సిపల్ అధికారులు ఎక్కడ..?

మున్సిపల్ అధికారులు ఎక్కడ..?
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నేపల్లి వద్ద వికారాబాద్ బస్ డిపో ముందు హైదరాబాద్ మార్గంలో రోడ్డు పై డ్రైనేజీ పొంగి ప్రవహిస్తుంది. కమల నగర్ సగెత్ నగర్ మధ్యలో హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఎడమ వైపున గత కొంతకాలంగా డ్రైనేజీ సమస్య ఏర్పడినప్పటికీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ.. స్పందించిన దాఖలాలు లేవు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ రోడ్డు పై ప్రవహిస్తున్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
