Asian Markets Crash : ₹100 లక్షల కోట్లు మ‌టాష్ Andhra Prabha Spl Story

Asian Markets Crash : ₹100 లక్షల కోట్లు మ‌టాష్ Andhra Prabha Spl Story

  • ఆసియా స్టాక్ పై బ్ల‌డ్ షెడ్
  • న‌ష్టాల్లో జ‌పాన్ ఫ‌స్ట్
  • భార‌త్ లో బ్లాక్ మండే షాక్
  • ₹10 లక్షల కోట్లు ఆవిరి
  • హాంగ్ కాంగ్ వామ్మో వాయ్యో
  • చైనా లాజిస్టిక్స్ బ్రేక్
  • $115 దాటిన చమురు ధర
  • మధ్యప్రాచ్య యుద్ధ భయం..
  • ఆసియా స్టాక్ మార్కెట్లలో రక్తపాతం
  • ముజ్తబా ఖమేనీ రాక‌తో మార్కెట్లు కుదేలు

( ఆంధ్ర‌ప్ర‌భ‌, బిజినెస్ డెస్క్)

ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ముజ్తబా ఖమేనీ బాధ్యతలు స్వీక‌రించిన కొద్ది క్ష‌ణాల్లోనే.. ఆసియా మార్కెట్టు కుప్ప‌కూలాయి. అటు గ‌ల్ఫ్ దేశాలు ఆత్య‌ర‌క్ష‌ణ కోసం వెల‌వెల పోతుంటే.. ఇటు ఆసియా స్టాక్ మార్కెట్లు నీర‌సంతో మోక‌రిల్లాయి.

Asian Markets Crash

Asian Markets Crash : ఆసియాలో మ‌నీ మ‌టాష్

మార్చి 9, 2026, సోమవారం ఉదయం 10:00 గంటల సమయానికి మధ్యప్రాచ్య యుద్ధం ఆసియా మార్కెట్లను రక్తపాతంలో ముంచెత్తింది. చమురు ధరలు $115 దాటగా, ఇరాన్ క్షిపణి దాడుల వార్తలతో మార్కెట్లు కుప్పకూలాయి.

Asian Markets Crash


ఆసియా అంతటా సుమారు $1.2 ట్రిలియన్ల (దాదాపు ₹100 లక్షల కోట్లు) వరకు మ‌దుప‌ర్ల సంపదఆవిరైనట్లు ప్రాథమిక అంచనా. సెన్సెక్స్ 1800 పాయింట్లు పతనం కావడంతో, భారత ఇన్వెస్టర్ల సంపద దాదాపు ₹10 లక్షల కోట్లకు పైగా ఒకే గంటలో గాలిలో కలిసిపోయింది. యుద్ధ కేంద్రానికి సమీపంలోని దేశాలు , చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలు ఘోరంగా దెబ్బతిన్నాయి . ఆసియాలో అత్యధికంగా జపాన్ (Nikkei 225): 3.2% పతనమైంది. పారిశ్రామిక ఉత్పత్తి నిలిచిపోతుందనే భయంతో జపాన్ మార్కెట్లు వణికిపోతున్నాయి. భారత్ 2.6% నష్టంతో రెండవ స్థానంలో ఉంది. చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపడమే దీనికి కారణం. హాంగ్ కాంగ్ (Hang Seng) 2.5% నష్టపోయింది. చైనాకు చెందిన టెక్, లాజిస్టిక్స్ షేర్లు భారీగా పడిపోయాయి. ఇక దక్షిణ కొరియా (Kospi): సుమారు 2.1% నష్టాన్ని చవిచూసింది.

Asian Markets Crash : భార‌త్ లో బ్లాక్ మండే

Asian Markets Crash

భారత మార్కెట్లు నేడు “బ్లాక్ మండే” (Black Monday) తరహా పతనాన్ని చూస్తున్నాయి. ఉదయం 10:00 గంటల సమయానికి పరిస్థితి ఇలా ఉంది: సెన్సెక్స్ (Sensex) దాదాపు 1,500 నుండి 2,000 పాయింట్లు, నిఫ్టీ (Nifty) 450 పాయింట్లకు పైగా నష్టపోయాయి. మార్కెట్ అస్సలు నిలకడగా లేదు. ప్రారంభమైన నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లు ఆవిరైపోయింది. భారతదేశం తన చమురు అవసరాల కోసం 80% పైగా దిగుమతులపై ఆధారపడుతుంది. ముడి చమురు ధర $115 దాటడంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం మార్కెట్లను కుదిపేస్తోంది.

Asian Markets Crash : మ‌స‌క మ‌స‌క చీక‌టిలో… రంగుల క‌ల‌

Asian Markets Crash

ముడి చమురు ధరల పెరుగుదలతో పెయింట్స్ , టైర్లు: రంగాల షేర్లు 5-7% పడిపోయాయి. బ్యాంకింగ్ , ఐటి రంగాల్లోని విదేశీ ఇన్వెస్టర్లు (FIIs) భారీగా నిధులను వెనక్కి తీసుకోవడంతో ఈ షేర్లు కుప్పకూలుతున్నాయి. గగనతలం మూసివేత , ఇంధన ధరల భారం వల్ల విమానయాన సంస్థల షేర్లు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి.

Asian Markets Crash : చ‌మురు కంపెనీల‌పైనే ఆశ‌..

Asian Markets Crash

బ్రెంట్ క్రూడ్ ధరలు నియంత్రణ లేకుండా పెరగడం వల్ల విమానయానం, పెయింట్స్, ఆటోమొబైల్ రంగాలు కుప్పకూలాయి. మార్కెట్ల నుండి డబ్బును వెనక్కి తీసుకుంటున్న ఇన్వెస్టర్లు, తమ పెట్టుబడులను బంగారం (Gold) , అమెరికా డాలర్ల వైపు మళ్లిస్తున్నారు. కేవలం రక్షణ రంగం (Defence) , చమురు ఉత్పత్తి చేసే సంస్థలు (ONGC, Reliance) మాత్రమే స్వల్పంగా నిలదొక్కుకుంటున్నాయి. బంగారం ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు మళ్లుతున్నారు.

ALSO READ : Iran War Shock | స్టాక్ మార్కెట్ ధ్వంసం

Leave a Reply