Delhi | ట్రయల్ కోర్టు వ్యాఖ్యలపై స్టే
Delhi | ట్రయల్ కోర్టు వ్యాఖ్యలపై స్టే
23మందికి నోటీసులు
Delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టు ఇటీవల నిందితులకు (కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియా సహా ) క్లీన్ చిట్ ఇచ్చిన తీర్పును సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది.
ఇవాళ ఈ పిటిషన్పై విచారణ జరిగిన తర్వాత హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రౌస్ ఎవెన్యూ కోర్టు చేసిన వ్యాఖ్యలపై స్టే విధించింది. ఈడీ కేసు విచారణను తాత్కాలికంగా వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసి, వచ్చే సోమవారం తిరిగి విచారణ చేపట్టనుంది. అదే సమయంలో కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియా సహా మొత్తం 23మంది నిందితులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ తీర్పుతో లిక్కర్ స్కామ్ కేసు మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
