Mojtaba Khamenei | ఆగయా.. ఇరాన్ సుప్రీం Andhra prabha Latest News
Mojtaba Khamenei | ఆగయా.. ఇరాన్ సుప్రీం Andhra prabha Latest News
ముజ్తబా ఖమేనీకి ఇరాన్ పగ్గాలు
అమెరికా ఆశలు అడియాశలే
ఆంధ్రప్రభ. వెబ్ డెస్క్

అమెరికా కల నెరవేరలేదు. ఇరాన్ లో అమెరికా బంటు నియామకం జరగలేదు. ఇప్పుడు తనను మించిన కరుడుగట్టిన వ్యక్తి ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ముజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) ఎన్నికయ్యారు. ఇరాన్‌కు చెందిన 88 మంది సభ్యులతో కూడిన అత్యున్నత మతగురువుల మండలి, అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ (Assembly of Experts), 2026 మార్చి 8న ముజ్తబా ఖమేనీని దేశ మూడవ సుప్రీం లీడర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. గత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, 2026 ఫిబ్రవరి 28న అమెరికా , ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో మరణించడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.
అలీ ఖమేనీ రెండవ కుమారుడు ముజ్తబా ఖమేనీ (వయస్సు 56 ఏళ్లు). ఈయన గతంలో ఎటువంటి ప్రభుత్వ పదవులను నిర్వహించలేదు. షాడో సుప్రీంగా తెరవెనుక ఇరాన్ భద్రతా బలగాలు ఆర్థిక సామ్రాజ్యంపై బలమైన పట్టు కలిగి ఉన్నారని ఇరానీయుల అభిప్రాయం, ఇరాన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా తండ్రి తర్వాత కుమారుడు సుప్రీం లీడర్ పదవిని చేపట్టడం ఒక చారిత్రక పరిణామం. ఇరాన్ ప్రస్తుతం అమెరికా ఇజ్రాయెల్‌లతో తీవ్ర యుద్ధ స్థితిలో ఉన్న సమయంలో ముజ్తబా ఈ బాధ్యతలను చేపట్టారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) ఇప్పటికే ఆయనకు తమ విధేయతను ప్రకటించాయి.
