నగరపాలక మేనేజర్‌కు అభినందనలు…

నగరపాలక మేనేజర్‌కు అభినందనలు…

కర్నూలు, ఆంధ్రప్రభ : నగరపాలక సంస్థ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మేనేజర్ యన్.చిన్నరాముడుకు శనివారం సిబ్బంది అభినందనలు తెలిపారు. నగరపాలక సంస్థ చరిత్రలో మేనేజర్‌గా పదేళ్లపాటు నిరంతరంగా విధులు నిర్వహించిన వ్యక్తిగా చిన్నరాముడు ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు.

అంకితభావం, నిజాయతీ, చిత్తశుద్ధితో తన బాధ్యతలను నిర్వర్తిస్తూ కార్యాలయ నిర్వహణలో సమర్థతను చాటుకుంటున్నారని సిబ్బంది కొనియాడారు.

Leave a Reply