Cordon search | పోలీసుల ‘వజ్ర పహార్’ కార్డన్ సెర్చ్

Cordon search | పోలీసుల ‘వజ్ర పహార్’ కార్డన్ సెర్చ్
Cordon search | యడ్లపాడు, ఆంధ్రప్రభ : ఆపరేషన్ వజ్ర పహార్ (పోలీస్ తనిఖీలు)ఆంధ్రప్రదేశ్ పోలీసులు నేరాలను అరికట్టడానికి, శాంతిభద్రతలను కాపాడటానికి “ఆపరేషన్ వజ్ర పహార్” పేరుతో కార్డన్ సెర్చ్ (సరిహద్దు తనిఖీలు) నిర్వహిస్తున్నామని సత్తనపల్లి (నరసరావుపేట ఇన్ చార్జీ) డిఎస్పి హనుమంతరావు, జిల్లా ట్రైన్ ఎస్పీ జయకృష్ణ తెలిపారు. శనివారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో గంజాయి,అక్రమ మద్యం, నాటు సారా విక్రయాలను అరికట్టడం, రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచడం జరుగుతుందన్నారు.
జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు జిల్లాలోని యడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని 12 స్పిన్నింగ్ మిల్లులపై పోలీసులు ఏకకాలంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు.ఈ ఆపరేషన్ కోసం ఇద్దరు డీఎస్పీల నేతృత్వంలో పోలీసులు 12 ప్రత్యేక బృందాలుగా విడిపోయి మిల్లుల్లోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల అనంతరం,మిల్లుల్లో పనిచేసే కార్మికులకు డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై పోలీసులు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.

యువత, కార్మికులు వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా సూచించారు. మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ, కార్మికులందరితో మత్తు పదార్థాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. అనుమానిత వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఈ తనిఖీలలో నరసరావుపేట వన్ టౌన్ సీఐ తెరెసా ఫెరోజ్, నరసరావుపేట టూ టౌన్ సీఐ ప్రభాకర్, నరసరావుపేట రూరల్ సిఐ ఎం వి సుబ్బారావు, వినుకొండ సి.ఐ, బి.ప్రభాకర్, చిలకలూరిపేట టౌన్, సిఐ పి.రమేష్,చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బానాయుడు, నరసరావుపేట రూరల్ఎస్ఐ.శ్రీకాంత్, బండ్లమీతు ఎస్ఐ షమీర్ బాషా, రోమిప్చెర్ల ఎస్ఐ సి.లోకేశ్వరరావు, చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ జి.అనిల్వ్కుమార్, కె.లేఖ ప్రియాంక, చిలకలూరిపేట టౌన్ ఎస్ఐ చెన్నకేశవులు, నాదెండ్ల ఎస్ఐ సిఆర్.వెంకటేశ్వరరావు, యడ్లపాడు ఎస్ఐ టి.శివరామకృష్ణ, 115 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు.



CLICK HERE TO READ MORE : “ఓపెన్ హౌస్” నిర్వహించిన గుంటూరు పోలీసులు..
