రోగులకు మెరుగైన సేవలు అందించాలి..

ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి మండల కేంద్రం లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ప్రభుత్వ సలహాదారు, బోధన్ శ్యాసనసబ్యులు సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. నేరుగా రోగులతో మాట్లాడిన సుదర్శన్ రెడ్డి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం మండల వైద్యాధికారి ప్రమోద్ ను పలు విషయాలపై ప్రశ్నించారు. రోగులకు అందాల్సిన సరైన వైద్యసేవలు అందేలా చూడాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది నిక్కచ్చిగా తమ డ్యూటీ చేయాలని, లేని యెడల చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్ రావు, స్థానిక సర్పంచ్ రాంచందర్, తదితరులు ఉన్నారు.

