ఉచిత వైద్య శిబిరం..

ఉచిత వైద్య శిబిరం..
ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని పోచమ్మ గుడి వద్ద ఈనెల 7వ తేదీ ( శనివారం) ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరగనున్నదని ఆ సమితి వ్యవస్థాపకులు, 8 వ వార్డు కౌన్సిలర్ బొట్ల సంపత్ తెలిపారు. ఈసీజీ, బీపీ షుగర్ , హిమోగ్లోబిన్, కంటి పరీక్షలను డాక్టర్ బొట్ల చాణక్య ఆధ్వర్యంలోని వైద్య బృందం ఈ శిబిరంలో నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
