సమస్యలను పరిష్కరించాలి..

సమస్యలను పరిష్కరించాలి..

నిజామాబాద్ అర్బన్, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రంలోని నగర ప్రెస్ క్లబ్ లో విశ్వబ్రాహ్మణులు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా,రాష్ట్ర అధ్యక్షులు వడ్ల హన్మండ్లు చారీ,రాష్ట్ర కోశాధికారీ టి.శ్రీనివాస్ చారీ,జిల్లా అధ్యక్షులు మారుపాక కిషన్ చారీ,జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల శ్రీనివాస్ చారీ లు మాట్లాడుతూ….ప్రభుత్వము మపై చిన్న చూపు చూపిస్తుందని,ఇకనైనా ప్రభుత్వము విశ్వబ్రాహ్మణులకు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా,ఆ సమావేశాల్లో విశ్వబ్రాహ్మణులకు రూ.1000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.అలాగే విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ పాలక మండలి ఏర్పాటు చేయాలని విశ్వబ్రాహ్మణ వృత్తి కళాకారులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము.స్వర్ణకారులపై పోలీసుల దాడులను అరికట్టాలని, జి.ఓ.272ను సవరించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని అటవీ శాఖ దాడులను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా విశ్వబ్రాహ్మణులు పాల్గొన్నారు.

Leave a Reply