ఆందోళనలో అన్నదాతలు..

ఆందోళనలో అన్నదాతలు..
మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతు భరోసా డబ్బులు వేస్తామని… అన్నదాతలకు ఆశ చూపి మురిపించిన సీఎం రేవంత్.. ఎన్నికలు ముగిసి నెల రోజులు గడుస్తున్నా అన్నదాతలను అలా మైమరిపించారే తప్పా రైతులకు భరోసా ఇవ్వలేదని పలువురు వాపోతున్నారు. ఇలా యాసంగి సీజన్ లో రైతు భరోసాకి రాం రాం పలకడంతో.. రైతన్నలు లబోదిబోమంటున్నారు. యాసంగి సీజన్ కాస్తా ముగుస్తున్నా.. యాదికొస్తలేదా సీఎంకి అని విమర్శిస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో నాటి సీఎం కేసీఆర్ ప్రతి సీజన్ కి ఎకరాకు రూ.5 వేలు వేసేవారని, ప్రస్తుతం సీఎం రేవంత్ రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ప్రతిపక్షాలు సైతం.. రైతు భరోసా డబ్బులు తక్షణమే రైతుల అకౌంట్లో జమ చేయాలని గగ్గోలు పెడుతున్నప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని విమర్శలు గుప్పిస్తున్నారు. రైతే రాజు… దేశానికి వెన్నుముఖ అని సామెతలు చెప్పడానికే కానీ… ఆచరణలో అమలు కావడం లేదని, తక్షణమే రైతులకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
