కూలీలపై తేనేటీగల దాడి.!

కూలీలపై తేనేటీగల దాడి.!

మేటుతో సహా 10 మందిపైన దాడి.!
సిరిసిల్ల ఏరియా అస్పత్రికి తరలించిన పజాప్రతినిధులు, అధికారులు.!

కోనరావుపేట, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని సర్వాయి చెరువు ప్రాంతంలో ఉపాధి హామీ కూలీలు కాలువ పనులు చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న తేనెటీగలు దాడి చేయడంతో గ్రామానికి చెందిన సుమారు పదిమంది ఉపాధి హామీ కూలీలపై మరియు మేటుపై తేనెటీగలు దాడి చేయడంతో గాయపడినారు.వారిలో పులి పాలవ్వ, తాళ్లపల్లి దేవవ్వ, రాజయ్య,కావంపల్లి నర్సవ్వ, సింగం రాజమణి, జక్కుల భూమయ్య,అంగురి రాములు,మేటు ముష్ణం పర్శరాములు లపై దాడి చేసిన విషయం తెలిసిన స్థానికులు,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్ స్థానిక సర్పంచ్ సింగం శ్రీహరి, ఏపీఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు బాధితులను సిరిసిల్ల ప్రభుత్వ అస్పత్రికి అంబులెన్సులో తరలించి చికిత్స చేపిస్తున్నారని వారు తెలిపారు.

Leave a Reply