100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ప్రయాణానికి ప్రాణం నిత్య శాఖ

100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ప్రయాణానికి ప్రాణం నిత్య శాఖ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆత్మ స్వరూపమే నిత్య శాఖ
సామూహికంగా చేసే తపస్సు లాంటిదే నిత్య శాఖ…
ఆర్ఎస్ఎస్ తెలంగాణ సహప్రాంత ప్రచారక్ కల్పగురి ప్రభు కుమార్
నిజామాబాద్, ఆంధ్రప్రభ : 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ప్రయాణానికి ప్రాణం నిత్య శాఖ మాత్ర మేననీవిఆర్ఎస్ఎస్ తెలంగాణ సహప్రాంత ప్రచారక్ కల్పగురి ప్రభు కుమార్ అన్నారు. నిత్య శాఖ ను దేశభక్తుల కార మా కారంగా ఎంతోమంది గుర్తించారని…శాఖలో తయారైన కోట్లాదిమంది స్వయం సేవకులు వివిధ రంగాలలో తమ ప్రఖర దేశభక్తితో దేశం కోసం పని చేస్తున్నారని వారందరికీ స్ఫూర్తినిచ్చింది నిరంతర స్ఫూర్తిని వారి హృదయా లలో రగిలింపజేస్తున్నది కూడా నిత్య శాఖ మాత్ర మేనని ఆయన స్పష్టం చేశారు.
ప్రతినిత్యము క్రమం తప్పకుండా ఒకే సమయంలో ఒకే చోట స్వయం సేవకులు అంద రూ సామూహికంగా చేసే తపస్సు లాంటిదే నిత్య శాఖ అని, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య పద్ధతి మొత్తానికి మూల మంత్రం నిత్య శాఖ మాత్ర మేనని ఆర్ఎస్ఎస్ తెలం గాణ సహ ప్రాంత ప్రచారక్ కల్ప గురి ప్రభు కుమార్ స్పష్టం చేశారు. ఆర్ఎ స్ఎస్ ఇందూరు నగర శాఖ ఆధ్వర్యంలో ఆది వారం నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదా నంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన ప్రభు కుమార్ మాట్లాడారు.

100 సంవత్సరాల ఈ ప్రయా ణంలో దేశంలోని అన్ని ప్రాంతాలకు ఆర్ఎస్ఎస్ విస్తరించిందని ఆర్ఎస్ ఎస్ కార్యకర్తల సంఖ్య పెరిగిన ప్రతిచోట సమా జంలో సౌభ్రాతృత్వము దేశభక్తి పెరిగి ఆయా ప్రాం తాలు సుభిక్షంగా ఉన్నా యని గుర్తు చేశారు. ఎంతోమంది దేశభక్తులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారు కూడా సంఘ కార్యం ఆవశ్య కతను గుర్తించి, ప్రశంసిం చారని,స్వయంగా స్వ తంత్ర ఉద్యమంలో పాల్గొ న్న సంఘస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ భారతదేశంలో అసలు స్వాతంత్రం కోల్పో వడానికి మూల కారణ మైన అసంఘటిత హిం దూ సమాజాన్ని సంఘ టితంగా చేయడం మాత్ర మే దీనికి శాశ్వతమైన పరిష్కారం అని గుర్తిం చారని, అందుకే ఆయన నిత్య శాఖ అనే మూల మంత్రాన్ని సంఘ సిద్ధాంత భూమికగా తయారు చేశారని ఆయన తెలిపా రు.
ప్రతినిత్యము ఒక గంట పాటు అందరం కలిసి చేసే పనుల వల్ల వ్యక్తుల మధ్య సమన్వ యం ఏర్పడి ఆ వ్యక్తుల సమూహము సమాజం కోసం ధర్మం కోసం దేశం కోసము పని చేసే స్ఫూర్తి వారిలో నిరంతరము రగులుతుందని అందుకే నిత్య శాఖను ఒక పవిత్ర హోమ జ్వాలగా వర్ణిస్తుంటారన్నారు.
ఇందూరులో మొట్ట మొదటి సంఘ శాఖ ప్రారం భమై 75 సంవత్సరాలు…
సంఘము ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి కావడం, ఇందూరు నగరం లో మొట్టమొదటి సంఘ శాఖ ప్రారంభమై 75 సంవ త్సరాలు పూర్తి కావడం ఎంతో ప్రత్యేకమైన సందర్భంగా ఆయన వర్ణిం చారు. ఇందూరు నగరం ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన నగరమని ఇక్కడి హిందువులు ఎంతో విశేషమైన ధర్మ నిష్ఠ కలిగిన వారిని ఆయన ప్రశంసించారు.
ఒక గంట దేశం కోసం వెచ్చించాలీ..
భగవంతుడు మనకి ఇచ్చిన 24 గంటల్లో 23 గంటలు వ్యక్తిగతం కోసం ఉంచుకొని కేవలం ఒక గంట దేశం కోసం వెచ్చిం చాలని సంఘస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ సూచిం చేవారని వారు తెలిపారు. ఒకానొక సమయంలో హిందువులను కలిపి ఉంచడం అంటే కప్పలను తక్కెడలో తూకం వేసినట్టే అది ఎన్నటికీ జరిగే పని కాదు అని చాలామంది డాక్టర్ జి ని వెక్కిరించా రని, కానీ ఈ రోజు ఈ సువిశాల హిందూ సమా జం సంఘటిత దృశ్యాన్ని చూసి సంఘపనిని సంఘ సిద్ధాంతాన్ని విమర్శించిన వారు సైతం సంఘము చేస్తున్న పని మాత్రమే ఈ దేశానికి శ్రీరామరక్ష అని మాట్లాడుతున్న సందర్భా న్ని గుర్తు చేశారు. క్రమశి క్షణ, సమయపాలన, దేశ భక్తి, ధర్మ నిష్ట ,వ్యక్తిగత శీలము, జాతీయ శీలము, సంస్కారము, సంస్కృతి పరిరక్షణ అనే ఎన్నో సుగు ణాలను సంఘ శాఖ ఆధా రంగా స్వయం సేవకులు ఉపాసన చేస్తున్నారని చిన్నచిన్న కార్యక్రమాల ద్వారానే విశేషమైన సుగుణాలను స్వయం సేవకులు నిత్య శాఖ అనే సాధన యజ్ఞంలో పొందుతున్నారని ఆయన తెలిపారు.
ఆర్ఎస్ఎస్ శాఖ అంటే సమాజం సంస్కారాలకి కేంద్ర బిందువు_
ఆర్ఎస్ఎస్ శాఖ అంటే సమాజం సంస్కారాలకి కేంద్ర బిందువు అని సం ఘానికి ఏ రాజకీయ అవ సరాలు లేవని ఆయన స్పష్టం చేశారు. మనిషి శరీరంలో గుండె ఏ విధంగా రక్తప్రసరణకు కేంద్ర బిందువుగా మారి అన్ని అవయవాలకు శుద్ధమైన రక్తాన్ని సరఫరా చేస్తుందో అదే విధంగా సమాజంలో సంఘ శాఖ సంస్కారాలను సమాజ పరివర్తన కోసము నిరంతరము అందిస్తుం దని ఆయన గుర్తు చేశారు.
శాఖ లేని బస్తీలో శాఖలు ప్రారంభించాలని శతాబ్ది సందర్భంగా శాఖ లేని బస్తీ ఉండకూడదని శాఖ కేవ లం ఒకసారి చేసే సాధన కాదని సమాజ కళ్యాణం కోసము భారతమాత కోసం నిరంతరము నిర్వి రామంగా ఆచరించే ఒక పవిత్ర యజ్ఞం అని భావిం చాలని ఆయన స్వయం సేవకులకు సూచించారు. అందరూ సంఘ కార్యకర్త లుగా మారి ఈ లోక హితం కోసము దేశ హితం కోసం పని చేస్తారని ఆశి స్తూ వారు ప్రసంగాన్ని ము గించారు. ఈ కార్యక్ర మంలో నగర కార్యవాహ అర్గుల సత్యం, సహ కార్యవాహలు సుమిత్ కుమార్, వెంకటేష్, నగర ,జిల్లా అధికారులు స్వయం సేవకులు పాల్గొన్నారు.
