అత్యంత వైభవంగా సూర్యోపాసన పూజలు..

అత్యంత వైభవంగా సూర్యోపాసన పూజలు..

ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం సూర్యోపాసన పూజలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆలయ వైదిక కమిటీ,వేద పండితులు అత్యున్నత స్థాయిలో ఈ సూర్యోపాసన పూజను జరిపించారు. లోక కళ్యాణం కోసం, భక్తుల ఆరోగ్య ప్రాప్తి కోసం వేద మంత్రోచ్ఛారణల మధ్య సూర్య భగవానుడికి ప్రత్యేక అర్చనలు, నమస్కారాలు నిర్వహించారు. పలువురు భక్తులు ఈ పూజలో ప్రత్యక్షంగా పాల్గొని అమ్మవారిని, సూర్యదేవుని ఆశీస్సులు పొందారు. ఆదివారాల్లో సూర్యోపాసన చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని పండితులు పేర్కొన్నారు.

Leave a Reply