Vijayawada | నూతన చీఫ్ సెక్రటరీకి దుర్గమ్మ ఆశీస్సులు..

Vijayawada | నూతన చీఫ్ సెక్రటరీకి దుర్గమ్మ ఆశీస్సులు..

Vijayawada | ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పదవీ బాధ్యతలు స్వీకరించిన జి.సాయి ప్రసాద్ కి విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (కనకదుర్గమ్మ ఆలయం) తరపున అర్చకులు అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. శనివారం ఏపీ సచివాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా, ఆలయ కార్యనిర్వాహణాధికారి వి.కె. శీనా నాయక్ నేతృత్వంలోని అర్చక బృందం ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఆలయ స్థానాచార్య వి. శివ ప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్. దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో అర్చక బృందం నూతన సీఎస్‌కు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీస్సులు అందజేశారు. ఆలయ ఈఓ వి.కె. శీనా నాయక్ శ్రీ కనకదుర్గ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదంతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి, శ్రీ అమ్మవారి కృపాకటాక్షాలుతో రాష్ట్ర అభివృద్ధిలో సాయి ప్రసాద్ వారి సేవలు విజయవంతం కావాలని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వేద పండితులు, అర్చకులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.