ఐక్యతకు మారుపేరు మేరు కులస్తులు..

ఐక్యతకు మారుపేరు మేరు కులస్తులు..

  • పేద మేరు కులస్తులకు ట్రస్ట్ ద్వారా 10 కుట్టు మిషిన్లు ఉచితంగా అందజేత
  • టైలర్స్ డే వేడుకలో పాల్గొన్న ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్, ఆంధ్రప్రభ : ఐక్యతకు మారుపేరు మేరు కులస్తులు అని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. మే రు కులస్తులంతా ఐక్య మత్యంతో ఉండి ప్రభు త్వంతో వారికి రావాల్సిన ఫలాలను పోరాడి మరి దక్కించుకుంటారని పేర్కొ న్నారు.సనాతన హిందూ సంస్కృతి సంప్ర దాయా లకు మేరు కులస్తులు అత్యంత ప్రాధా న్యత ఇస్తుంటారని వారు కుట్టే కుట్టు మిషన్లకు పూజ చేయనిదే బట్టలు కూడా కుట్టరని ఎమ్మెల్యే తెలిపా రు.అది వారికి ఉన్న హిం దూ సంస్కృతి గొప్పదనం గౌరవం అని ఆయన అన్నారు.

శనివారం నిజాంబాద్ నగరంలోని వేరు కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన టేలర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లా డారు.టైలర్స్ డేకు తనకు ఎన లేని సంబంధం ఉందని, ప్రతి టైలర్స్ డే రోజున మేరు కులస్తులు నిర్వ హించే కార్యక్ర మంలో పాల్గొని వారికి ప్రోత్సాహం అందిస్తానని చెప్పారు. ప్రతివారు కూడా రెడీమేడ్ దుస్తులకు దూరంగా ఉండి దర్జీలు కష్టపడి కుట్టే బట్టలను ధరించాలన్నారు. ఈ సందర్భంగా మేరు కుల స్తులలో అత్యంత పేద వారు గా ఉన్న టైలర్స్ కు ఎమ్మెల్యే తమ ట్రస్ట్ ద్వారా పది కుట్టు మిషన్లు ఉచి తంగా అందజేశారు.

దీం తో మేరు కులస్తులు సంతో షం వ్యక్తం చేశారు. అనం తరం ఎమ్మెల్యే ని వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో మేరు కుల సంఘం అధ్యక్షులు హన్మంతరావు మరియు కార్యవర్గం సభ్యులు. బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మి నారాయణ, చింతకాయల రాజేందర్,బెల్లల్ శశాంక్ , బీజేపీ నాయకులు పండు బంటు ప్రవీణ్, మురళి, పవన్ ముండా, శివ, పంచారెడ్డి సురేష్, ప్రభాకర్ త పాల్గొన్నారు.

Leave a Reply