ప్రజలందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి ….

జుక్కల్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని నాగల్ గాం గ్రామసర్పంచ్ సునంద విజయ్ పటేల్ అన్నారు.శనివారం నాడు గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించగా ఆమె అధ్యక్షత వహించారుఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు, ఉపాధిహామీ కూలీల కూలీల హాజరు.పచ్చదనం పరిశుభ్రతఇందిరమ్మ గృహాల నిర్మాణ పురోగతి.ఇందిరమ్మ గృహాల అర్హుల వివరాలు మంచినీటి సరఫరాతో పాటు గ్రామంలో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించడం జరిగింది. ఈ గ్రామసభలో ఉప సర్పంచ్ అమృత్గొండ,కార్యదర్శి లింగురామ్, వార్డ్ సభ్యులతో పాటు,గ్రామప్రజలు ఉపాధిహామీ సిబ్బంది,ఆశ మరియు అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply