Sudden | విద్యార్థులు లక్ష్యసాధనకు కష్టపడి చదవాలి

Sudden | విద్యార్థులు లక్ష్యసాధనకు కష్టపడి చదవాలి
పది, ఇంటర్ విద్యార్థులు పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
Sudden | ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఎ.కొండూరు మండలంలోని పలు పాఠశాలలను ఎన్.టి. ఆర్ జిల్లా విద్యాశాఖాధికారిణి ఎల్.చంద్రకళ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పాఠశాలల తనిఖీల్లో భాగంగా శనివారం డీఈఓ చంద్రకళ ఎ.కొండూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని, రామచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరుగుతున్న ఎర్త్ ఫిల్లింగ్, మెస్ డోర్ల ఏర్పాటు, శానిటేషన్, డార్మిటరీలు, ఎలక్ట్రికల్ పనులతో పాటు విద్యార్థుల అభ్యసననా సామర్ధ్యాలు తరగతి వారీగా పర్యవేక్షించారు. పాఠశాల విద్యాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు.
పబ్లిక్ పరీక్షల దృష్ట్యా ఇంటర్మీడియట్, పదవ తరగతి విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. విద్యార్థులు గొప్ప లక్ష్యాలను ఏర్పరచుకోవాలని, లక్ష్యసాధనకు కష్టపడి చదవాలని దిశానిర్దేశం చేశారు. చక్కగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, చదువుతున్న పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఇ బాలాజీ, జీసీడీ ఓ,బి. విశ్వభారతి, ఎం ఈ ఓ టు ఈ ఎల్ సి కేశవరావు, ప్రధానోపాధ్యాయులు సుల్తానా, ఎన్. విజయసుందరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
