Vetlapalem | భారీ పేలుడు..చెల్లాచెదురైన మృతదేహాలు..

Vetlapalem | భారీ పేలుడు..చెల్లాచెదురైన మృతదేహాలు..

Vetlapalem | వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
మంటల్లో చిక్కుకున్న కార్మికులు.. 18 మంది కార్మికులు మృతి

Vetlapalem | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ః కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటావుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహయక చర్యలు చేపట్టారు. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే 20 మంది కార్మికులు మంటల్లో చిక్కుకునట్లు అధికారులు తెలిపారు. వారిని బయటకి తీసుకురావాడనికి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

ఈ మంటల్లో చిక్కుకొని నలుగురు కార్మికులు మృతి చెందారు. పలువురి కార్మికుల పరిస్థితి విషమంగా ఉండడంతో అధికారులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుప్రతికి తరిలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రాథమికంగా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం లేదా పేలుడు పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. పేలుడు వివరాలు అధికారులు సీఎం తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లాలని హోంమంత్రి అనితకి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

సీఎం చంద్ర‌బాబు దిగ్రాంతి

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు దిగ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌మాదం తీరుపై సీఎం సమీక్ష జ‌రిపారు. విజయనగరం పర్యటనలో ఉన్న సీఎంకు ఈ ప్రమాద ఘటన వివ‌రాల‌ను అధికారులు తెలిపారు.
విజయనగరం నుంచే ఉన్నతాధికారులతో సీఎం ఆరా తీశారు. ప్రమాదానికి కారణాలు… ప్రస్తుతం అక్కడ అందుతున్న సహాయక చర్యలపై అధికారుల‌ను ప్ర‌శ్నించారు. ప్రమాదం జరిగిన సూర్య ఫైర్ వర్క్స్ లో 20 మంది వరకు పని చేస్తున్నారని ధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో బాణసంచా తయారీదారులు ప్రాణాలు కోల్పోవడం పై సీఎం విచారం వ్యక్తం చేశారు. మంత్రులను, ఉన్నతాధికారులను ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు.

కార్మికుల‌ను ఆదుకుంటాం మంత్రి అచ్చెంనాయుడు

కాకినాడ జిల్లా వేట్లపాలెం సమీపంలోని బాణసంచా కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు . ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు . ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని, అగ్నిమాపక సిబ్బంది మరియు రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.
ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు . ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అవసరమైన సహాయాన్ని వెంటనే అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
మెరుగైన వైద్యం అందించండి ః మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్

వెట్లపాలెంలో బాణా సంచా పేలుడు ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. తక్షణ వైద్య సహాయక చర్యలు చేపట్టాలని వైద్య శాఖ కార్య‌ద‌ర్శి, డీఎంఈ, డీహెచ్ ఎంవో ను ఆదేశించారు. సూపర్ స్పెషాలిటీ వైద్యులు, ఇతర సిబ్బoదిని ప్ర‌మాదం స్థలానికి వెంటనే పంపాలని ఆదేశించారు. అంబులెన్సు లు అందుబాటులో ఉంచాలని , ప్రాథమిక సమాచారం ప్రకారం ఏడుగురు చనిపోయారని మంత్రికి అధికారులు వివ‌రించారు.

వేట్లపాలెం పేలుడు ఘటనపై గవర్నర్ నజీర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పటివరకు 13 మృతదేహాలు అధికారులు గుర్తించారు. మృతులు అడబాల శ్రీను కడిపల్లి కృష్ణమ్మ,ధనరాజ్,సాధనల సత్యవతి, వల్లూరి రవి, రాము, గంపల మంగ, గోడత మహేష్, మందపల్లి చిన్ని, నాని, నిమ్మడ కర్ణ, గొట్ట మహేష్, రమణ, యజమాని అడబాల శ్రీను గా గుర్తించారు

Leave a Reply