Pradeep ranganathan | అలా చేస్తున్నాడా..?

Pradeep ranganathan | అలా చేస్తున్నాడా..?

Pradeep ranganathan | ‘లవ్ టుడే’తో స్టార్ ఇమేజ్ సంపాదించిన ప్రదీప్
కోలీవుడ్‌లో మరో ధనుష్‌గా పేరుగాంచిన యంగ్ హీరో
ప్రస్తుతం చేతిలో ఎనిమిది సినిమాలు
25 కోట్ల రెమ్యూనరేషన్‌కు నిర్మాతలు ఓకేనా?
నిర్మాతగా మారేందుకు ప్రదీప్ ప్లాన్స్

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.. ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తమిళ్ లో వలే తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అందుకనే.. ప్రదీప్ తో సినిమాలు చేసేందుకు అటు తమిళ్, ఇటు తెలుగు ప్రొడ్యూసర్స్ క్యూకడుతున్నారు. అయితే.. తన క్రేజ్ కు తగ్గట్టుగా ప్రదీప్.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేశాడట. అయినప్పటికీ.. నిర్మాతలు వెంటపడుతున్నారట. ఇంతకీ.. ప్రదీప్ రెమ్యూనరేషన్ ఎంత..? ఆయన చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయి..?

Pradeep ranganathan | మరో ధనుష్‌..

Pradeep ranganathan

లవ్ టుడే సినిమాకి ముందు ప్రదీప్ అంటే ఎవరో తెలియదు. లవ్ టుడే రిలీజ్ తర్వాత.. ప్రదీప్ కి మంచి పేరు వచ్చింది. యూత్ లో క్రేజ్ పెరిగింది. తర్వాత డ్యూడ్ మూవీ చేస్తే.. ఆ సినిమా కూడా సక్సెస్ అయ్యింది. దీంతో ప్రదీప్ తనకంటూ ఓ మార్క్ సృష్టించుకున్నాడు. ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా బాగా ఆడాయి. నిర్మాతకు భారీగా లాభాలు తీసుకువచ్చాయి. ఇలా ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ప్రదీప్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవుతుండడంతో తమిళ్ లో దాదాపు స్టార్ అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే.. అక్కడ మరో ధనుష్‌ అంటున్నారు.

Pradeep ranganathan | ప్రదీప్ రెమ్యూనరేషన్ 25 కోట్లు..

Pradeep ranganathan

ధనుష్ కోసం రాసుకున్న కథలన్నీ.. ఇప్పుడు ప్రదీప్ దగ్గరకు వస్తున్నాయి. యూత్ లో ప్రదీప్ కి క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పుడు ప్రదీప్ చేతిలో ఎనిమిది సినిమాలు ఉన్నాయి. కోలీవుడ్ లో ఇన్ని సినిమాలు చేతిలో ఉన్న హీరో ప్రదీపే. అయినప్పటికీ దర్శకనిర్మాతలు క్యూలో ఉన్నారు. ఇప్పుడు తన క్రేజ్ కు తగ్గట్టుగా రెమ్యూనరేషన్ బాగా పెంచేశాడని టాక్ వినిపిస్తోంది. 25 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట.

Pradeep ranganathan

తెలుగు, తమిళ్.. రెండింటీలో మార్కెట్ ఉండడంతో నిర్మాతలు కూడా అడిగినంత ఇవ్వడానికి రెడీ అంటున్నారు. అయినా ప్రదీప్ దగ్గర డేట్స్ లేవు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రదీప్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తుందని సమాచారం. ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలు నిర్మించాలి అనుకుంటున్నాడట ప్రదీప్. మరి.. హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేసినట్టుగా ప్రొడ్యూసర్ గా కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తాడేమో..

Leave a Reply