డిప్యూటి కలెక్టర్ చిత్రు పటేల్ కు సన్మానం

డిప్యూటి కలెక్టర్ చిత్రు పటేల్ కు సన్మానం

జన్నారం, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చదివి డిప్యూటి కలెక్టర్ స్థాయికి ఎదిగిన రాయిసీడం చిత్రు పటేల్ ను శాలువా కప్పి సన్మానించారు. ఆ పాఠశాల ఆవరణలో బుధవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆ పాఠశాల హెచ్ఎం శివరాజం,చిత్ర పటేల్ కు శాలువా కప్పి సన్మానించారు.

మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన అల్లీనగర్ లో జన్మించిన చిత్ర పటేల్ రెవెన్యూ శాఖలో ఆఫీస్ సబార్డినేటుగా విధుల్లో చేరి డిప్యూటి తాహసిల్దారుగా, తాహసిల్దారుగా అంచెలంచచెలుగా ఎదిగి ప్రస్తుతం డిప్యూటి కలెక్టర్ హోదాలో జగిత్యాల జిల్లా మైనారిటి వెల్ఫేర్ ఆఫీసరుగా పనిచేస్తున్నారు.ఈ సందర్భంగా చిత్రు పటేల్ మాట్లాడుతూ,5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇదే ఆశ్రమ పాఠశాలలో చదివానన్నారు.

ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకుంటే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చునని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పీడీ గణేష్,ఉపాధ్యాయులు ఫిరాజి,భీర్షా,శంకరయ్య, కిషన్ రావు, చందులాల్, పాఠశాల సంరక్షకుడు రాజేష్ పాల్గొన్నారు.

Leave a Reply