దౌనెల్లిలోని పశు వైద్య శిబిరం

దౌనెల్లిలోని పశు వైద్య శిబిరం

పశువులకు టీకాలు వేస్తున్న సర్పంచ్ మెట్టు రాజు

కుంటాల ,ఆంధ్రప్రభ; పశువులకు వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తగా టీకాలు వేశారు. కుంటాల మండలంలోని దౌనెల్లి గ్రామంలోని పశు గణభివృద్ధి ఆధ్వర్యంలో పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పశువులకు స్థానిక సర్పంచ్ మెట్టు రాజు టీకాలు వేశారు. అనంతరం పశువైద్య శిబిరాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం పశువైద్యాధికారి డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ పశువులకు గర్భకోశ వ్యాధి ఉన్న పశువులు సూడి పరీక్షలు చేసుకునే పశువులు గుడ్డు మేత పశువులు ఎదకు వచ్చిన పశువులకు ఉచితంగా కృత్రిమ గర్భ ధారణ చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.

అనంతరం నట్టల నివారణ మందులను పశువులకు పంపిణీ చేశారు. రైతులకు పశువుల పట్ల పలు సూచనలను అందజేశారు. జాగ్రత్తలు పాటించాలని వేసవికాలం దృష్ట్యా పశువుల పట్ల ప్రత్యేక దృష్టిసరించాలని రైతులకు సూచించారు. అదేవిధంగా ప్రతి గ్రామంలోని పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర లు పశువైద్యాధికారులు గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply