హంతకులను కఠినంగా శిక్షించాలి…

హంతకులను కఠినంగా శిక్షించాలి…

చిన్నారి హత్యకు కారణమైన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలి లేదా ఉరి తీయాలి
హoతకుడు ఎవరైనా ఏ పార్టీకి వారైనా జైల్లో పెట్టాలి
ఎనిమిది మందిపై హత్య నేరం కేసు నమోదు చేయాలి
బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం అందించాలి
తక్షణ సాయంకాలం లక్ష రూపాయలు
ఆ కుటుంబానికి 10 లక్షలతో ఇంటి నిర్మాణం చేయిస్తాం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభః నాగర్ కర్నూలు మండలం కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసికందు మృతికి కారణమైన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని లేదా అవసరమైతే ఉరితీయాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని కేటీఆర్ సందర్శించారు.ఆ కుటుంబ సభ్యులైన చంద్రకళ మౌనిక గణేష్లను పరామర్శించి ఆ కుటుంబానికి అండగా ఉంటామని తక్షణసాయంగా లక్ష రూపాయలు అందించారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాల న్యాయం అయ్యేంతవరకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని నిరంతరం ఈ పోరాటం కొనసాగించాలని కోరారు.

వచ్చనెల 16 నుండి జరగబోయే అసెంబ్లీలో ఈ సమస్య పరిష్కారం కాకపోతే ప్రభుత్వాన్ని ఈ విషయంపై నిలదీస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ ఘటన తెలంగాణ సమాజం మొత్తంగా ఆవేదనతో తలదించుకుని దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. పసిపాప హంతకులకు అండగా నిలబడ్డ ఎవరైనా ముమ్మాటికీ దోషిలననిఆయన అన్నారు. అంతకుడి ఎవరైనా ఏ పార్టీకి చెందిన వారైనా వారిని జైల్లో పెట్టాలని దాడి చేసిన 8 హంతకుల పైన హత్య నేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బాధిత కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన మానవత్వానికి మచ్చని దుర్మార్గమైన ఘటనాన్ని ఆయన వివరించారు.
దర్శనం అడిగిన పాపానికి ఆ కుటుంబంపై దాడి చేస్తారని అధికారం అడ్డం పెట్టుకొని హంతకులకు అండగా నిలబడడం తప్పు, దుర్మార్గంగా కొట్టిన వారిని శిక్షించాల్సి ఉండగా బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులు సిగ్గు లేకుండా యూనిఫాం గౌరవం కోల్పోయే విధంగా వ్యవహరిస్తున్నారని బాధితుల ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేయకుండా నిందితులైన వారిపై వారు ఇచ్చిన ఫిర్యాదును కేసు చేస్తారని న్యాయం చేయాలని అడిగితే దాడి చేస్తారని కేటీఆర్ అన్నారు.

ముక్కు పచ్చలారని రెండు నెలల పసికoదుకు కులం మతం అధికారం తెలుసా ఎంత దుర్మార్గమైన చర్య ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ఇటువంటి క్రూరమైన వ్యక్తులపై తప్పకుండా హత్య నేరం కేసు నమోదు చేయాల్సిందేనని డిమాండ్ డిమాండ్ చేశారు ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని స్థానిక మాజీ శాసనసభ్యులు జనార్దన్ రెడ్డి అండగా నిలిచి పది లక్షలతో ఇంటి నిర్మాణం చేయిస్తామని ఆ కొత్త ఇంటికి తాను వచ్చి ప్రారంభిస్తానని హామీ ఇచ్చి ఈ పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఈ హంతకులకు శిక్ష పడే విధంగా మనమందరం ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జేఏసీ బీఎస్పీ విశారదన్ నాయకులు కార్యకర్తలు అందర్నీ అభినందిస్తున్నానని మీ అందరికీ నేను అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మర్రి జనార్దన్ రెడ్డి , మాజీమంత్రులు శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ అంజయ్య యాదవ్ హర్షవర్ధన్ రెడ్డి మనోహర్ నరేందర్ గోలి శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు

Leave a Reply