Tragic incident | ఆ బాధతోనేనా…?

Tragic incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : యూట్యూబర్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంకు చెందిన కోమలి (21).. హైదరాబాద్‌లో బీఎస్సీ చదువుతోంది. మణికొండలోని చిత్రపురి కాలనీ ఎల్‌ఐజీలో బంధువుల వద్ద ఉంటోంది.
విశాఖపట్నం చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, యూట్యూబర్ నిఖిల్ రెడ్డిని ఆమె ప్రేమిస్తోంది. కోమలి నుంచి దూరంగా ఉండేందుకు నిఖిల్ ప్రయత్నిస్తుండటంతో ఆరు నెలల క్రితం ఆమె ఆత్మహత్యకు యత్నించగా.. బంధువులు సర్దిచెప్పారు. ఇటీవల పెళ్లి విషయంలో కోమలి, నిఖిల్‌రెడ్డి గొడవపడ్డారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో కోమలి ఉరివేసుకుంది. ఆమె తల్లి రాయదుర్గం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
