కలెక్టర్ ఇలా త్రిపాఠికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు..

ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి మండలం మంగళ్ పహాడ్ కు చెందిన రఘుపతి అబ్బయ్య అనే వ్యక్తిని, తన కుటుంబాన్ని కుల సంఘం కుల బహిష్కరణ వేటు వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సంబంధించిన ఇంటి స్థలాన్ని వేరొకరు కబ్జా చేశారని, న్యాయం చేయాలని సంఘం పెద్దలను ఆశ్రయిస్తే తనను కుల బహిష్కరణ చేశారని పేర్కొన్నాడు.

అట్టి స్థలాన్ని విక్రయించాలని లేదంటే తనను గ్రామంలో ఎవరు పలకరించవద్దని హుకుం జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పిల్లలు పెళ్లి వయస్సుకు వచ్చారని, కులానికి చెందిన ఎవరైనా తన పిల్లలను వివాహం చేసుకుంటే రూ.12 వేల జరిమానా విధిస్తామని ఆంక్షలు విధించారని అబ్బయ్య పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Leave a Reply