రాష్ట్ర స్థాయిలో నిలపాలి

రాష్ట్ర స్థాయిలో నిలపాలి
ఉన్నత లక్ష్యాలతో చదువుకోవాలి
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యంపై వాకబు
నిర్లక్ష్యం చేయద్దని వైద్యులకు సూచించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ని రాష్ట్ర స్థాయిలో ఉత్తమ కాలేజ్ గా నిలిచేలా అధ్యాపక బృందం నిరంతరం అంకితభావంతో పని చేయాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. సోమవారం జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం ఉన్నతమైన లక్ష్యాలతో అధ్యాపకులు, సిబ్బంది పని చేయాలన్నారు. గత ఏడాది కంటే ఈ సారి అడ్మిషన్స్ సంఖ్య బాగా పెరిగిందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు క్రమశిక్షణ, అంకితభావం,సంకల్పంతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఇదే కళాశాలలో తాను చదువుకున్నానని, చదువుతో తల్లిదండ్రులు కలలు నిజం చేయవచ్చని విద్యార్థులకు వివరించారు.
అంతకుముందు విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాల నృత్యాలతో హోరేత్తించారు. ఎమ్మెల్యే ను గజమాలతో సన్మానించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల భూమి సర్వే కొనసాగుతుందని, ఆక్రమణకు గురైన భూమి స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపట్టాలని తహసీల్దార్ ను ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.అంతకుముందు 30 పడకల ప్రభుత్వం ఆసుపత్రిని పరిశీలించి వైద్యులతో సమావేశమయ్యారు.

ప్రజలకు వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులను ఆదేశించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. అదే విధంగా పలువురు రోగులను వైద్యం ఎలా అందుతుందని, సౌకర్యాలు ఎలా ఉన్నాయని, మందులు, డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నారా? అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.రోగులు అన్ని సక్రమంగా అందుతున్నాయని తెలుపడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలీ నర్సయ్య, వైస్ చైర్ పర్సన్ మోతుకూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆకుల శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రావు,తహసీల్దార్ దిలీప్ కుమార్,నాయకులు గడ్డం త్రిమూర్తి, ఆరీఫ్, రమేష్,నాగభూషణం, కౌన్సిలర్స్, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

