జిల్లా అధ్యక్షుడిగా సోమగాని నరేందర్

జిల్లా అధ్యక్షుడిగా సోమగాని నరేందర్
హుజూర్నగర్, ఆంధ్రప్రభ : హుజూర్నగర్ పట్టణానికి చెందిన డాక్టర్. సోమగాని నరేందర్ ను రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్.ఎల్.డి ) పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ సోమవారం హైదరాబాదులోని రాష్ట్ర కార్యాలయంలో నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సూర్యపేట జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికై పోరాటం చేస్తూ జనంలోకి ఆర్.ఎల్.డి పార్టీని తీసుకెళ్తూ బలోపేతం చేయాలని సూచించారు. తన నియామకానికి సహకరించిన ఆర్.ఎల్.డీ రాష్ట్ర నాయకులకు జిల్లా పార్టీ సభ్యులకు సోమగాని నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు.
