స్వాతంత్ర్య సమర తొలి దీప్తికి ఘన నివాళి.

స్వాతంత్ర్య సమర తొలి దీప్తికి ఘన నివాళి

రాయలసీమ వీరుడు ఉయ్యాలవాడకు
కర్నూలులో గౌరవ వందనం.
.బ్రిటిష్ దోపిడీకి తొలి సవాల్ విసిరిన యోధుని స్మరణ.
మహా వీరుడికి ప్రజల పుష్పాంజలి.
. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్‌లో ఘన నివాళులు.

( కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ.)

భారత స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జ్ఞాపకార్థం కర్నూలు నగరంలోని హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్ సమీపంలో గల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ వద్ద ఘన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమం ప్రారంభానికి ముందు విశిష్ట అతిథులు, ప్రజాప్రతినిధులు, సమితి సభ్యులు కలిసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించి మహా వీరుడి త్యాగస్ఫూర్తిని స్మరించుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, “ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర్యోద్యమానికి తొలి దీప్తి. ఆయన పోరాటం రాయలసీమ గర్వకారణం మాత్రమే కాదు, దేశ చరిత్రలో స్ఫూర్తిదాయక అధ్యాయం,” అని పేర్కొన్నారు. యువత దేశభక్తి, సమాజ సేవా భావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కర్నూల్ నగరంలోని మ్యూజియంను ప్రతి విద్యార్థి, ప్రజలు సందర్శించాలన్నారు. అక్కడున్న కళాఖండాల ద్వారా మనకు ఎంతో సమాచారం.. చరిత్రలకు సంబంధించిన ఆధారాలు. వివరాలు తెలుసుకోగలుగుతామన్నారు. కన్నుల్ నగర అభివృద్ధి ప్రధానంగా తీసుకొని పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే నగరంలో ఎన్నో పార్కులు, ప్రధాన రోడ్లు అభివృద్ధి చేస్తున్న విషయాన్ని మంత్రి భరత్ గుర్తు చేశారు. ముఖ్యంగా కర్నూల్ మెడికల్ కళాశాల సమీపంలో రోడ్డు విస్తరణ అంశాన్ని ప్రధానంగా తీసుకొని విస్తరించిన విషయాన్ని గుర్తించేశారు. ఇక్కడ సున్నితమైన అంశాన్ని కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిష్కరించామన్నారు.

ఉయ్యాలవాడ ఆదర్శంగా ఉద్యమ స్ఫూర్తి

తదనంతరం వేరు సమయాల్లో కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే , వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, ఆయన సతీమణి ఎస్వీ విజయ మనోహరి మాట్లాడుతూ, “నరసింహారెడ్డి రైతుల ఆత్మగౌరవానికి ప్రతీక. అన్యాయానికి ఎదురు నిలబడే ధైర్యం ఆయన జీవితం మనకు నేర్పుతుంది,” అన్నారు.

“దేశభక్తి అనేది మన రోజువారీ జీవనంలో ఆచరణలో కనిపించాలి. మహా వీరుల ఆశయాలను గౌరవించడం అంటే సమాజ న్యాయాన్ని కాపాడటం,” అని తెలిపారు.సమరయోధుల స్మారక సమితి సభ్యులు మాట్లాడుతూ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం 1857 కంటే ముందే బ్రిటిష్ పాలనకు సవాల్ విసిరిందని, ఆయన త్యాగం భారత స్వాతంత్ర్య సంగ్రామానికి మార్గదర్శకమైందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఈ చరిత్రను పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమం దేశభక్తి నినాదాలతో మార్మోగగా, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని మహా వీరుడికి నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు నిర్వహించిన సామాజిక సేవలకు చిన్హంగా ఉయ్యాలవాడ సమితి ఆధ్వర్యంలో సన్మానం, సత్కారం భావించారు, ముఖ్యంగా విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. మాంటిసో రి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చారిత్రాత్మక ను కనుల రూపకంగా ప్రదర్శించారు. అంతకుముందు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంపాల్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన సమితి సభ్యులతో కలిసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చారిత్రాత్మకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు.కార్యక్రమంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సమితి అధ్యక్షుడు ఏ. విజయ్ మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి,సంయుక్త కార్యదర్శి – రాయపు నాగార్జున రెడ్డి, సంయుక్త కార్యదర్శి రమణా రెడ్డి, డాక్టర్ బ్రహ్మారెడ్డి,కార్పొరేటర్ కైప పద్మలత, సంయుక్త కార్యదర్శి జితేంద్ర
ఖజాంచి, తిలక్, సభ్యులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply