archery | ఆర్చరీలో నిహారిక ప్ర‌తిభ‌

వెండి పతకం సాధించిన అల్లంపల్లి గురుకుల విద్యార్థిని

కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని అల్లంపల్లి జీయర్ గురుకులం విద్యార్థిని గోపు నిహారిక ఆర్చరీ పోటీలలో ప్రతిభ చూపి వెండి పతకాన్ని సాధించింది ఈనెల 21న సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలను ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించారు. రాష్ట్రస్థాయి సీఎం క‌ప్‌ పోటీల్లో ఆర్చరీ విభాగంలో రెండో స్థానం సాధించిందని గురుకుల పాఠశాల హెచ్ఎం చక్రధర్ తెలిపారు నిర్మల్ జిల్లా తరఫున రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని పతకం సాధించిన నిహారికకు హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు

Leave a Reply