School | ఏం జరిగిందంటే…

School | ఏం జరిగిందంటే…
School | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో ఉన్నట్టుండి ఉపాధ్యాయుడు కుప్పకూలిన ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని వేమునూరు శివారు ఉత్తర తండాలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు శంకర్ గుండెపోటుతో ఇవాళ మృతిచెందారు.
పాఠాలు బోధిస్తుండగా అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలినట్టు ఆ పాఠశాల విద్యార్థులు తెలిపారు. వెంటనే సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని సహచర ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉపాధ్యాయుని ఆకస్మిక మరణంతో విద్యార్థులు, గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
