superstar| ఇక బాక్సాఫీస్‌ బ‌ద్ద‌లే..

superstar| ఇక బాక్సాఫీస్‌ బ‌ద్ద‌లే..

  • బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ రెడీ
  • కమల్, రజనీ కాంబోలో మూవీ
  • KHxRK అని వర్కింగ్ టైటిల్ ఫిక్స్
  • 4 నిమిషాల ప్రొమో రిలీజ్‌

47 ఏళ్ల తర్వాత…
రజనీకాంత్, కమల్ హాసన్ భారతీయ సినిమా చరిత్రలో ఈ స్టార్స్ కు ప్రత్యేక పేజీలు ఉంటారు. ఈ నటులు దాదాపు ఐదు దశాబ్దాలుగా తమిళ చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. తమ నటన, స్టైల్ తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఎన్నో సినిమాల్లోనూ నటించారు. దాదాపు 20కు పైగా సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఒక సినిమాలో కలిసి యాక్ట్ చేస్తున్నారు రజనీ, కమల్. సుమారు 47 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్ మళ్ళీ కలిసి నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మెగా ప్రాజెక్టుకు ప్రస్తుతం #KHxRK అని వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియో విడుద‌లై అద‌ర‌గొడుతోంది.

4 నిమిషాల ప్రొమో అదిరింది..
తాజాగా విడుదలైన 4 నిమిషాల ప్రొమోలో రజనీకాంత్, కమల్ హాసన్ వింటేజ్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. లెదర్ జాకెట్లు, స్టైలిష్ షేడ్స్‌తో వారు ఒలికించిన మేనరిజమ్స్ 1980ల నాటి గోల్డెన్ డేస్‌ని గుర్తుకు తెచ్చాయి. ఈ గ్లింప్స్ చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

‘జైలర్’ దర్శకుడు నెల్సన్..
‘జైలర్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు నెల్సన్ ఈ భారీ బాధ్యతను తీసుకున్నారు. ఈ మూవీ దాదాపు రూ. 600 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కుతోంది. రజనీకాంత్ కేవలం ఈ సినిమా కోసం రూ. 225 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. రెడ్ జాయింట్ పిక్చర్స్ రాజ్ కమల్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2026 ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. ఈ క్రేజీ మల్టీస్టారర్‌ను 2027 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply