Andhra University | బీసీలకు వ్యతిరేకంగా…

Andhra University | బీసీలకు వ్యతిరేకంగా…

Andhra University | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ వద్ద మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏయూ ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఏయూ గేటు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న ఏబీవీపీ నేతలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ నేతలను అరెస్టు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. బీసీలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

గత కొన్ని రోజులుగా లెఫ్ట్, రైట్ వింగ్ విద్యార్థి సంఘాల మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. క్యాంపస్ ప్రశాంతతకు భంగం కలిగించే చర్యలను అడ్డుకునేందుకు యూనివర్సిటీ యాజమాన్యం రంగంలోకి దిగింది. మతపరమైన కార్యక్రమాలు, క్యాండిల్ మార్చ్‌లు వంటి కార్యక్రమాలు నిర్వహించరాదని, అనుమతి లేకుండా బయటి వ్యక్తులు క్యాంపస్‌లోకి రాకూడదని నోటీసు జారీ చేసింది.

Leave a Reply