శారాజీపేటలో ఇంటింటి సర్వే..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ జాతీయ సేవా పథకంలో భాగంగా శుక్రవారం మండలంలోని శారాజిపేట గ్రామంలో ఇంటింటి అక్షరాస్యతా సర్వేను నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ గ్రూపులుగా విడిపోయి వార్డుల వారీగా ఇంటింటి సర్వేను చేపట్టారు. ఈ సర్వే లో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కు ఇంటి యజమానులు తమ విద్యా వివరాలను అందజేశారు. గ్రామంలోని అందరూ కుటుంబ సభ్యుల విద్యావిషయిక వివరాలను వాలంటీర్స్ కు తెలిపారు. వాలంటీర్ల సర్వే పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. నల్ల బోలు.ముత్యాలు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఉష, చైతన్య, నాజియా, అక్షయ, ప్రకృతి రాజా,సంతోష్ సాయి, సౌమ్య శిరీష, సౌమ్య,వర్ష, లక్ష్మణ్,బాలాజీ,మనోజ్,రామ్ చరణ్,గణేష్,ఇర్ఫాన్,శివ ప్రియ, అన్షు ,అపూర్వ, సుకన్య, సిరి పాల్గొన్నారు.
