ప్రైవేటు పాఠశాల స్కూల్ బస్సు దగ్ధం పై చర్యలేవి?

ప్రైవేటు పాఠశాల స్కూల్ బస్సు దగ్ధం పై చర్యలేవి?

  • బిజేపీ మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్

చిట్యాల, ఆంధ్రప్రభ : గత పది రోజుల క్రితం ప్రమాదవశాత్తు చల్లగరిగే, కు చెందిన రైజింగ్ సన్ ప్రైవేటు పాఠశాల బస్సు అగ్ని ప్రమాదానికి గురికాగా, నేటి వరకు ఆ పాఠశాలపై ఎలాంటి చర్యతీసుకోకుండా కాలయాపన చేయడం తగదని,బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్, అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ మామూళ్ల మత్తులో మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ, ఆర్టిఏ అధికారులు ఉన్నారని వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. మండలంలో ప్రవేట్ పాఠశాలలను తనిఖీ చేయకుండా, స్కూల్ బస్ లకు ఫిట్నెస్ ఉన్నాయా లేవ చెక్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూన్న మండల విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేసి పర్మినెంట్ విద్యాశాఖ అధికారిని నియమించాలన్నారు.

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ పాఠశాలలపై స్థానిక ఎమ్మెల్యే , జిల్లా కలెక్టర్ , స్పందించి ఈ ఘటనపై విచారణ జరిపించిబాధ్యులైన అధికారుల పై, స్కూలు యజమాన్యం పై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.లేనిపక్షంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్, సీనియర్ నాయకులు గజనాల రవీందర్, ఓదెల శ్రీహరి ,కధం రాజు,తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply